దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ జస్టిస్ ఫర్ దిషా హత్య సంఘటనపై స్పందించిన పోలీసులు ప్రతి కిరణం షాప్ పెట్రోల్ బంకులో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని నోటీసులు జారీ చేశారు.
ఈ మేరకు షాద్ నగర్ సబ్ ఇన్ స్పెక్టర్ విజయభాస్కర్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని పెట్రోల్ బంకులకు లిఖితపూర్వకంగా నోటీసులు జారీ చేశారు బాటిళ్లు డబ్బాలు తీసుకొని వస్తే పెట్రోల్ పొయ్యవద్దని నోటీసులో పేర్కొన్నారు ఎవరైనా అనుమానితులు వస్తే 100 కాల్ చేసి సమాచారం ఇవ్వలని కోరారు ..